Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
చంద్రబాబు కేసుల కొట్టివేతపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో అధికారులను భయపెట్టి, బెదిరించడం ద్వారానే తనపై నమోదైన కేసులను సీఎం నారా చంద్రబాబు నాయుడు కొట్టేయించుకున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉండటంతో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగులు DSC కేసును ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో, చంద్రబాబుపై ఉన్న కేసులను కూడా అదే రీతిలో డైల్యూట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తన కేసుల్లో తనకు తానే క్లీన్ చిట్ ఇప్పించుకుని, ఏ తప్పూ చేయలేదనడం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.
వ్యవస్థలను ప్రభావితం చేస్తూ కేసుల నుంచి బయటపడటం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని జగన్ స్పష్టం చేశారు.
Tags:#Andhra Pradesh#National




